సింగరేణి కార్మికుడికి కరోనా..విధుల్లో ఉన్నవారంతా క్వారంటైన్

By రాణి  Published on  9 April 2020 1:05 PM GMT
సింగరేణి కార్మికుడికి కరోనా..విధుల్లో ఉన్నవారంతా క్వారంటైన్

  • నిజామాబాద్ లో ఒక్కరోజే 8 కేసులు

భూపాలపల్లిలో ఉంటున్న సింగరేణి కార్మికుడు కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లగా అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడి కూతురికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఇద్దరినీ హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా..కొద్దిరోజుల క్రితమే సింగరేణిలో లే ఆఫ్ ప్రకటించారు. మార్చి 19వ తేదీ నుంచి 30 వరకూ కరోనా బాధితుడు విధులకు హాజరైనట్లు గుర్తించారు. సదరు పాజిటివ్ వచ్చిన వ్యక్తి విధుల్లో ఉన్నపుడు అతడితో పాటు ఎవరెవరు విధులకు హాజరయ్యారో వారందరినీ క్వారంటైన్ అవ్వాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.

Also Read : అతలాకుతలమైన రైతన్న..

తెలంగాణలో రోజురోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో గురువారం ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా అధికారి నారాయణరెడ్డి వెల్లడించారు. వీరితో కలిపి ఇప్పటి వరకూ మొత్తం 47 కరోనా కేసులున్నట్లు నిర్థారించారు. అలాగే మర్కజ్ వెళ్లొచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యధిక కేసులున్న ప్రాంతాలను గుర్తించి ప్రజలెవ్వరూ బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.

Also Read :క్వారంటైన్ లో పౌష్టికాహారం

Next Story