కరోనా: కరీంనగర్‌కు వచ్చిన వారిలో 77 మందిని గుర్తింపు
By సుభాష్ Published on 22 March 2020 6:25 AM ISTకరోనా వైరస్ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. కరోనా పేరు వింటేనే జనాలు గజగజవణికిపోతున్నారు. ఎన్నడు లేనంతగా దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇక తాజాగా ఈ వైరస్ మనదేశంలో వ్యాపించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోకి ఈ వైరస్ పాకింది. ఇటు తెలంగాణలో కూడా విదేశాల నుంచి వచ్చిన వారితో మరింతగా ఈ వైరస్ వ్యాపించింది. ముందుగా ఒకరిద్దరు ఉన్న బాధితుల సంఖ్య ఇప్పుడు 21కి చేరింది. వీరిలో ఇండోనేషియాకు చెందిన పలువురు ప్రభోదకులు ఢిల్లీ నుంచి కరీంనగరర్‌కు చేరుకోవడంతో కరోనా బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. వీరు దాదాపు 1500 కిలోమీటర్లు తిరిగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి వీరంతా రైలు మార్గంలో కరీంనగర్‌కు చేరుకున్నారు. వీరిలో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే విదేశాల నుంచి ఎంత మంది వచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మొత్తం 77 మందిని గుర్తించారు పోలీసులు.వీరిలో ఇండోనేషియా నుంచి 13 మంది, కాజకిస్తాన్ నుంచి 19 మంది, థాయ్‌లాండ్ నుంచి 8 మంది, , మలేషియా నుంచి 13 మంది, ఇరాన్ నుంచి 14 మంది, సుడాన్ నుంచి 10 మంది మన దేశానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు వీరు మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తిరిగినట్లు తెలుస్తోంది. నగరానికి వచ్చిన 64 మందికి వైద్య పరీక్షలు చేశారు.