హైదరాబాద్‌: అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తొలిసారిగా తన్నీరు హరీష్రావు 2020-2021 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం లక్షా82వేల914కోట్లతో ఈ బడ్జెట్ను రూపొందించినట్లు హరీష్రావు తెలిపారు. దీనిలో రెవెన్యూ ఆదాయం లక్షా38వేల669.82 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం 22,061,18కోట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా రెవెన్యూ మిగులు రూ.4,482.12కోట్లుగా హరీష్రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రం రూ. 33,191.25 కోట్లు లోటు బడ్జెట్గా పేర్కొన్నారు. కేంద్రం నుంచి తగిన సహకారం లభించటం లేదని, అరకొరగా నిధులు మంజూరు చేస్తున్నందు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని మంత్రి చెప్పకనే చెప్పారు. దేశం తలసరి ఆదాయం కంటే రాష్ట్రం తలసరి ఆదాయం ఎక్కువ అని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2లక్షల28వేల216 అని, దేశ తలసరి ఆదాయం కేవలం లక్షా35వేల 50 అని హరీష్రావు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో 23.7శాతం వృద్ధి సాధించామని తెలిపారు. పాడి పశువుల రంగంలో 17.3శాతం వృద్ధి ఉందని, అన్నారు.

రూ. 25వేల లోపు రుణాలంటే ఒకే దఫా మాఫీ..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీకి కట్టుబడి ఉన్నట్లు హరీష్రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. రూ.25వేలలోపు రుణాలున్న రైతులందరికీ ఒకే దఫాలో రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇలాంటి రైతులు రాష్ట్రంలో 5.84లక్షల మంది ఉన్నారని, వీరందరికీ రుణాలను నూటికి నూరుశాతం పూర్తిచేస్తామని చెప్పారు. ఇందుకోఐసం ఈనెలలో రూ.1,198 కోట్లు విడుదల చేస్తామని హరీష్రావు స్పష్టం చేశారు. రుణమాఫీ మొత్తాన్ని ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతులుమీదుగా అందిస్తామని హరీష్రావు తెలిపారు. అదేవిధంగా రైతు బీమా కోసం రూ.1,141 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సాగునీటికి 11వేల కోట్లు..

బడ్జెట్లో సాగునీటి రంగానికి హరీష్రావు పెద్దపీట వేశారు. ఈ రంగానికి 11వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. చిన్ననీటిని పారుదలశాఖకు రూ. 6వందల కోట్లు, రైతు నివేదక నిర్మాణానికి రూ. 3వందల కోట్లు కేటాయించినట్లు హరీష్రావు తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.