హైదరాబాద్ : రేపు(శనివారం) తెలంగాణ బంద్‌కు రెవెన్యూ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మెకు తెలంగాణ రెవెన్యూ సంఘాల సంఘీభావం ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. ఉద్యోగులంతా భోజ‌న విరామ స‌మ‌యంలో న‌ల్ల బ్యాడ్జీల‌ను ధ‌రించి రాష్ట్రంలో అన్ని త‌హ‌శీల్దార్, ఆర్డీఓ, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల ముందు నిర‌స‌న తెలుపాల‌ని పిలుపునిచ్చాయి. అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఆర్టీసీకి మ‌ద్ద‌తుగా చేప‌ట్టే నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయాలని పిలుపునిచ్చాయి. అయితే…సీఎం కేసీఆర్‌ మంత్రులను ప్రగతి భవన్‌లోనే ఉండమని..పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడి ఎంగేజ్‌మెంట్ కు వెళ్లారు. మళ్లీ వచ్చే వరకు ప్రగతి భవన్‌లోనే మంత్రులను ఉండాలని ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపైరాత్రికి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశముందని అనుకుంటున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.