12,13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!

By సుభాష్  Published on  8 Oct 2020 2:07 PM IST
12,13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!

ఈనెల 12,13వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోమ, మంగళవారాల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం కావాలని, ముఖ్యమంత్రి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ చట్టాల్లో సవరణలు, హైకోర్టు సూచించిన అంశాల్లో చట్ట సవరణల కోసం అసెంబ్లీని సమావేశ పర్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమాశాలకు సంబంధించి శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంతోపాటు పలు కీలక బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. అలాగే కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Next Story