హైదరాబాద్: ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యమైంది. అబ్దుల్లాపూర్‌మెట్టు మండలం పిగ్లిపూర్ గ్రామ చెరువులో ఈతకు వెళ్లి సందీప్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. అతని మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహన్ని బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు సందీప్ సెయింట్ మేరీస్ కాలేజీలో బీటేక్ సెకండీయర్ చదువుతున్నాడు. సందీప్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లో వారణాసి. బుధవారం తొటి మిత్రులతో కలిసి పిగ్లిపూర్ బొమ్మల చెరువులోకి ఈతకు వెళ్లాడు. గుంతలు ఉండడంతో సందీప్ నీటిలో మునిగిపోయాడు.