తెలంగాణ టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూన్‌ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో పదో తరగతి విద్యార్థుల పరీక్షలు సైతం నిలిచిపోవడంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొని ఉండేది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడ్డ టెన్త్‌ పరీక్షలను జూన్‌ 8వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకూ మిగిలిన పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 వరకు నిర్వహించనున్నారు.

జూన్‌ 8న – ఇంగ్లీష్‌ పేపర్‌1
11న – ఇంగ్లీష్‌ పేపర్‌ 2
14న – మ్యాథ్స్‌ పేపర్‌ 1
17న – మ్యాథ్స్‌ పేపర్‌ 2
20న – సైన్స్‌ పేపర్‌ 1
23న – సైన్స్‌ పేపర్‌ 2
26న సోషల్‌ పేపర్‌ 1
29న సోషల్‌ పేపర్‌ 2 పరీక్షలను నిర్వహించనున్నారు.
కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని విద్యాశాఖ తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి అని తెలిపింది అంతేకాదు క్లాసుకు 20 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని, ప్రతి పరీక్ష సెంటర్‌లోనూ హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటు ఉంచనున్నారు.

10th

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *