బ్రేకింగ్: తెలంగాణలో జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు.. టైమ్ టేబుల్ ఇలా..
By సుభాష్ Published on 22 May 2020 10:41 AM GMTతెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూన్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో పదో తరగతి విద్యార్థుల పరీక్షలు సైతం నిలిచిపోవడంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొని ఉండేది. లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ టెన్త్ పరీక్షలను జూన్ 8వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకూ మిగిలిన పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 వరకు నిర్వహించనున్నారు.
జూన్ 8న - ఇంగ్లీష్ పేపర్1
11న - ఇంగ్లీష్ పేపర్ 2
14న - మ్యాథ్స్ పేపర్ 1
17న - మ్యాథ్స్ పేపర్ 2
20న - సైన్స్ పేపర్ 1
23న - సైన్స్ పేపర్ 2
26న సోషల్ పేపర్ 1
29న సోషల్ పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని విద్యాశాఖ తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి అని తెలిపింది అంతేకాదు క్లాసుకు 20 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని, ప్రతి పరీక్ష సెంటర్‌లోనూ హ్యాండ్ శానిటైజర్లు అందుబాటు ఉంచనున్నారు.