ముంబై : టీమిండియాను ఫిక్సింగ్ భూతం వెంటాడుతూనే ఉంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కొంత మంది ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం విచారణలో తేలింది. అయితే..ఓ పెద్ద క్రికెటర్‌ కూడా ఈ అవినీతిలో చిక్కుకున్నట్లు ఏసీయూ రహస్య నివేదిక వెల్లడించినట్లు సమాచారం.

ఫిక్సింగ్ భూతంపై ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ ఆసక్తికర, కీలక వ్యాఖ్యలు చేశారు. బుకీల మనస్తత్వాన్ని చదివినట్లు చెప్పాడు. ట్రాప్‌లో ఎవరైతే ఈజీగా పడతారో వారినే బుకీలు సెలక్ట్ చేసుకుంటారన్నారు. ఆట పట్ల, దేశం పట్ల అంకితభావం ఉన్నవారిని బుకీలు ఎట్టి పరిస్థితుల్లో సంప్రదించరు. ఎందుకంటే వారిని కలిసి సమయం వృధా చేసుకోవడమేనని అనుకుంటారట బుకీలు. అంతేకాకుండా..మంచి పేరున్న క్రికెటర్లు తమకున్న మంచిపేరును పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అని అజిత్ సింగ్ వ్యాఖ్యలు చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.