ఏపీ భవిష్యత్తుపై టీడీపీ పొలిట్ బ్యూరో ఆందోళన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Oct 2019 7:54 PM ISTగుంటూరు: గ్రామస్థాయి రోడ్ల నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు అన్ని పనులు నిలిచిపోయాయని టీడీపీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. నాలుగు నెలల్లో 17శాతం ఆదాయం తగ్గిందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై టీడీపీ పొలిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కియా కంపెనీ ప్రారంభానికి సీఎం రాకపోతే ఎవరూ పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు. 2007లో మీడియా పై ఆంక్షల కోసం ..YSR తెచ్చిన జీవోనే జగన్ ఇప్పుడు తీసుకు వచ్చారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. నీటి విషయం లో పొరుగు రాష్ట్రాలతో కలిసి ప్రాజెక్ట్ లు సరి కాదుని టీడీపీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఎవరి ప్రాజెక్ట్ లు వాళ్లే కట్టుకోవాలని పొలిట్ బ్యూరో అభిప్రాయ పడింది.
బావ ప్రకటన స్వేచ్ఛను అణిచి వేసేలా సీఎం నిర్ణయాలు ఉంటున్నాయని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మేధావులు మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు.