పంచాయితి భవనాలకు వైసీపీ రంగులు వేయడం ఎంతవరకు కరెక్ట్? - టీడీపీ నేత సుజయ కృష్ణ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 6:12 PM IST
పంచాయితి భవనాలకు వైసీపీ రంగులు వేయడం ఎంతవరకు కరెక్ట్? - టీడీపీ నేత సుజయ కృష్ణ

అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు వైఎస్ఆర్ సీపీ రంగులు వేయడం ఎంత వరకు కరక్ట్ అని ప్రశ్నించారు టీడీపీ నేత సుజయ కృష్ణ రంగారావు. సీఎం డౌన్ డౌన్ అంటే..మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. తక్షణము కలమట వెంకటరమణను విడుదల చేయాలన్నారు.

సత్యనారాయణ రాజు, టీడీపీ ఎమ్మెల్సీ

అనుభవం లేని వ్యక్తి సీఎంగా ఏపీలో ఉన్నారని విమర్శించారు సత్యనారాయణ రాజు. సీఎంకి సీనియర్ అధికారులైనా మంచి సలహాలు ఇవ్వాలన్నారు.లోటు బడ్జెట్‌లో రాష్ట్రం ఉంటే..పంచాయతీ భవనాలకు రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు సీఎం చెప్పే ప్రతి దానికీ సరే అనకుండా... భవిషత్ లో వచ్చే ఇబ్బందులు చెప్తే మంచిదన్నారు సత్యనారాయణ రాజు.

Next Story