చంద్ర‌బాబు ఇసుక దీక్షతో జ‌గ‌న్‌కు 'కుర్చీ' భయం పట్టుకుంది

By Medi Samrat  Published on  16 Nov 2019 8:18 AM GMT
చంద్ర‌బాబు ఇసుక దీక్షతో జ‌గ‌న్‌కు కుర్చీ భయం పట్టుకుంది

ముఖ్యాంశాలు

  • నేను పార్టీ మార‌ట్లేదు : బోడే ప్ర‌సాద్
  • అభధ్రతా భావంలో వైఎస్ జగన్
  • వంశీ వ్యక్తిగత విమర్శలు చేయటం మానుకోవాలి

శాసనసభ ఎన్నికల్లో ఆబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ అభధ్రతా భావంలో ఉన్నార‌ని మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. చంద్రబాబు ఇసుక దీక్ష చేపట్టిన నాటినుండి కుర్చీ భయం పట్టుకుందని.. 151మంది ఎమ్మెల్యేల‌ను గెలిపిస్తే.. వారితో కాకుండా మా శాసనసభ్యులను భయపెట్టి.. బెదిరించి మాపై ఉసిగొల్పుతున్నార‌ని జగన్ పై ఫైర్ అయ్యారు.

సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసి కొడాలి నాని ఇష్టం వచ్చి నట్లు మాట్లాడుతున్నారని తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం సంస్కారమా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉద్యమాన్ని.. ఇతర సమస్యలను ప్రక్క దారి పట్టించేందుకే మా శాసనసభ్యుల‌తో తిట్టిస్తున్నావని.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసేయాలనే ఆలోచనతోనే ఇలా వ్యవహరిస్తూన్నావని విమ‌ర్శించారు.

మేము ప్రాణాలకు బయపడే వాళ్ళం కాదని.. నీ దురాగతాలను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఒకే రోజు ఇద్దరు నేతలను తీసుకెళ్ళావని.. నీ ఎమ్మెల్యేలు ప్రక్క చూపులు చూస్తున్నారని.. నువ్వు జైలుకి వెళ్ళటం తప్పదని సీఎం జ‌గ‌న్ ను ఉద్దేశించి అన్నారు.

రాజకీయాల‌న్నా.. రాజకీయ నాయకులన్న ప్రజలు అసహ్యించుకుంటూన్నరని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ అన్నారు. నేను పార్టీని వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాన‌ని.. అవసరమైతే రాజకీయాలనుండి తప్పుకుంటాను.. కానీ పార్టీ మారనని స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా, రాజేంద్రప్రసాద్ లపై వ్యక్తిగత విమర్శలు చేయటం వ‌ల్ల‌భ‌నేని వంశీ మానుకోవాలని బోడే ప్ర‌సాద్ సూచించారు.

Next Story
Share it