మూడు పరోటాలు తినండి... లక్ష రూపాయలు గెలవండి
By అంజి Published on 3 March 2020 8:28 AM ISTమూడు పరోటాలు 50 నిమిషాల్లో తినండి, లక్ష రూపాయలు బహుమతి గా పొందండి. హర్యానాలోని తపస్య హోటల్ ఓ వినూత్న పోటీ నిర్వహిస్తోంది. రోహ్‌తక్‌లోని తపస్య హోటల్ పెద్ద పరోటాలకు పెట్టింది పేరు. ఈ పరోటాలపై ఆ హోటల్ యాజమాన్యం ఓ పందెం నిర్వహిస్తుంది. మూడు పరోటాలను 50 నిమిషాల్లో తింటే లక్ష రూపాయలు ఇస్తారు. జీవితాంతం ఉచితంగా భోజనం కూడా అందిస్తారు. 2006లో ఈ పందెం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరే ఈ పందెంలో గెలిచారని హోటల్ యాజమాన్యం చెబుతున్నారు. ఈ హోటల్‌లో మొత్తం 50 రకాల పరోటాలు మూడు సైజుల్లో తయారు చేస్తారు. వాటిలో బంగాళదుంప, కాలీఫ్లవర్, ఉల్లిపాయ, ఆలూ మిక్స్ పరోటాలున్నాయి.
ఇక్కడే ఉంది అసలు విషయం.. మీరు తినాల్సిన పరోటా మాములు పరోటా కాదు. జంబో పరోటా.
ఇక జంబో సైజు పరోటా ఒక్కోటి రెండున్నర అడుగుల మేర ఉంటుంది. దానిని నెయ్యితో తయారుచేస్తారు. ఇక ఆ పరోటాలో రెండు కిలోల కుర్మా కూడా వేస్తారు. ఇక్కడ ఒక మీడియం పరోటా ధర 90 రూపాయలు. ఇక జంబో పరోటా ఒకటి రూ.300ల పైన ఉంటాయి. ఈ జంబో పరోటా ఒక్క దాన్ని ఐదుగురు తినచ్చు. జంబో పరోటాలను తినేందుకు చాలా దూరం నుంచి భోజన ప్రియులు ఇక్కడికి వస్తుంటారట.