తమిళనాడు, కేరళలకు వరుణుడి దెబ్బ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2019 8:42 PM ISTతమిళనాడును భారీ వర్షాలు ముంచేశాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు విస్తారంగా వర్షం పడింది. తంజావూరు, నాగపట్నం, రామనాథపురం, శివగంగై, పుదుక్కో టై, అరియలూరు, కోవై, తేని, నీలగిరి, కన్యాకుమారి, కడలూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డా యి. భారీ వర్షాల కారణంగా నీలగిరి జిల్లాలో 50 ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడి వందకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక జలాశయాలు పూర్తిగా నిండుతుండడంతో అదనపు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
జాలర్లు సముద్రంలోకి వెళ్లొద్దు
మరో 3 రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చే సింది. సముద్రంలో గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పుదుచ్చేరిలోనూ వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వం, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కేరళపై వరణుడి కన్నెర్ర
కేరళపై వరణుడు మరోసారి కన్నెర్ర చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆరూర్, కొన్నీ, ఎర్నాకుళం, మంజేశ్వరం, వట్టియూర్కావు తదితర నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షం పడింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల జనజీవనం స్తంభించింది. ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో నీరు నిలి చిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని 12 జిల్లాలో కుండపోత వర్షం కురస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించిం ది. ఈ మేరకు అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం విజయన్ ఆదేశించారు.
కర్ణాటకకు వరద ముప్పు
కర్ణాటకకు మరోసారి వర్షాల ముప్పు ముంచుకొచ్చింది. ఉత్తర కర్ణాటకలో శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. 2 నెలలక్రితం బెళగావిని వరదలు ముంచెత్తగా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. బెళగావి వ్యాప్తంగా కుండపోత వర్షం పడడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మలప్రభ నదీ తీరంలో హెచ్చరికలు జారీ చేశారు. సుమారు ఆరేడు గ్రామాలు మునిగిపోయే ప్ర మాదం ఏర్పడడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నవిలుతీర్థ జలాశయం నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఫలితంగా రాకపో కలు నిలిచిపోయాయి. హుబ్బళ్ళి, ధార్వాడ, కొడగుల్లోనూ భారీ వర్షం కురిసింది. కొప్పళ జిల్లాలోని ఓ రిసార్టులో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చిన 350 మంది టెక్కీలు వరదలో చిక్కుకున్నారు. తుంగభద్ర నది వరద పెరగడంతో వారంతో అందులో చిక్కుకుపోయారు. ఐతే, అదృష్టవశాత్తూ వారు ప్రమాదం నుంచి బయ టపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర కర్ణాటకలో ఈనెల 24వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.