ఆత్మహుతి దాడి.. 8 మంది సైనికులు మృతి

By సుభాష్  Published on  21 July 2020 9:55 AM GMT
ఆత్మహుతి దాడి.. 8 మంది సైనికులు మృతి

ఆప్ఘనిస్థాన్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌ మైదాన్‌ వార్ధాక్‌లో సోమవారం మధ్యాహ్నం తాలిబన్లు దాడికి తెగబడ్డారు. తాలిబన్ల కారుబాంబు ఆత్మహుతి దాడిలో 8 మంది ఆప్ఘన్‌ జాతీయ ఆర్మీ సైనికులు మృతి చెందగా, మరో 9 మంది సైనికులు గాయపడినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ధృవీకరించింది. కాబూల్‌కు పశ్చిమ దిశలోని సయీద్‌ అబాద్‌ జిల్లాలో సైఇనకుల కాన్వాయ్‌ను లక్ష్యం చేసుకుని ఈ దాడి చేసినట్లు సైనిక అధికారులు పేర్కొన్నారు.

అయితే జరిపిన దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించాయి. పౌరులపై ఆప్ఘన్‌ సైనికులు జరుపుతున్న వైమానిక దాడులకు ప్రతీకారంగానే దాడికి పాల్పడినట్లు వారు చెబుతున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న దాడులను అరికట్టేందుకు తాలిబన్లతో చర్చలు జరిపేందుకు అంగీకరించినప్పటికీ, తాలిబాన్లు ఆప్ఘన్‌ దళాలపై దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.

Next Story