భారీ భూకంపం.. రిక్టార్ స్కేలుపై తీవ్రత 6.8
By సుభాష్ Published on 16 Jun 2020 4:11 PM ISTఓ వైపు కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే మరో వైపు భూకంపాలు తీవ్రతరం అవుతున్నాయి. గడిచిన మూడు నెలల వ్యవధిలోనే అనేక దేశాల్లో భూకంపాలు సంభవించాయి. తాజాగా మంగళవారం తుజకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తజకిస్థాన్‌లోని దశన్బే ప్రాంతానికి 341 కిలోమీటర్ల దూరంలో ఈ భూకం కేంద్రాన్ని గుర్తించారు.
అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపాలు భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో కూడా తాకాయి. మంగళవారం కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 5.8గా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Next Story