గాలిపటం తోకకు చిక్కుకున్న మూడేళ్ళ బాలిక.. 100 మీటర్ల పైకి ఎగిరిపోయింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2020 3:42 AM GMT
గాలిపటం తోకకు చిక్కుకున్న మూడేళ్ళ బాలిక.. 100 మీటర్ల పైకి ఎగిరిపోయింది

గాలిపటం అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉండరు చెప్పండి.. కానీ ఈ బాలికకు ఎదురైన ఘటన కారణంగా గాలిపటం అంటేనే భయపడుతుందేమో..! సాధారణంగా కైట్ ఫెస్టివల్స్ వంటివి జరిగే సమయంలో పెద్ద ఎత్తున గాలిపటాలను తయారు చేస్తూ ఉంటారు. భారీ సైజుల్లో, వివిధ ఆకారాల్లో గాలిపటాలను ఎగురవేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఫెస్టివల్ తైవాన్ లో చోటుచేసుకోగా.. అక్కడికి వెళ్లిన మూడేళ్ళ బాలిక ఓ పెద్ద గాలిపటం తోకకు చిక్కుకుని గాల్లోకి ఎగిరిపోయింది. దాదాపు 100 మీటర్ల ఎత్తుకు ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కాషాయం రంగు ఉన్న గాలిపటం తోకకు చిక్కుకుపోయిన ఆ బాలిక గాల్లోకి ఎగరడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్క క్షణం షాక్ కు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ ఎక్కడ కిందకు పడిపోతుందో అని టెన్షన్ పడ్డారు. ఆ బాలిక గట్టిగా పట్టుకోవడం వల్ల కాబోలు గాలి పటం తోక కాస్తా కింద వరకూ వచ్చింది. దీంతో ఆ బాలికను కింద ఉన్న వాళ్లు పట్టేసుకున్నారు. దాదాపు 30 సెకెండ్ల పాటూ ఆ బాలిక ఆకాశంలోనే ఉంది.

ఆ బాలిక పేరు 'లిన్' అని స్థానిక మీడియా తెలిపింది. బాలికకు చిన్నపాటి గాయాలు అయ్యాయని తెలిపారు. తైవాన్ లోని హిషించు (Hsinchu) నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.Next Story