'దోషి' లావుగా ఉన్నాడు.. అందుకే జైలుకు పంపలేము: కోర్టు

By సుభాష్  Published on  1 Sep 2020 2:24 AM GMT
దోషి లావుగా ఉన్నాడు.. అందుకే జైలుకు పంపలేము: కోర్టు

సాధారణం కోర్టులో నేరం రుజువైతే ఎవరైనా సరే జైలు శిక్ష అనుభవించాల్సిందే. దోషి నేరం చేసిన దానిని బట్టి అతడికి జడ్జి శిక్షను ఖరారు చేస్తారు. అయితే లైంగిక వేధింపుల విషయంలో మాత్రం జైలు శిక్ష మాత్రం తప్పకుండా పడుతుంది. అది ఎన్ని నెలలో చెప్పలేము. కానీ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి తాను నేరం చేసినట్లు కోర్టులో అంగీకరించినా ఆయనను జైలుకు పంపడానికి జడ్జి నిరాకరించారు. కారణం ఏమిటంటే.. దోషి లావుగా ఉండటమే ఇందుకు కారణమట.

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు చెందిన పీటన్‌ జాన్‌ ఒనీల్‌ అనే 61 ఏళ్ల వ్యక్తి గతంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, పీటర్‌ తాను చేసిన తప్పులను ఒప్పుకొన్నాడు. దీంతో దీంతో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా, దోషిగా తేలినా లావుగా ఉన్నాడని జైలుకు పంపేందుకు జడ్జి నిరాకరించారు. గతంలో ఫిట్‌గానే ఉన్న పీటర్‌ తర్వాత లావుగా మారిపోయాడు. ఎంతలా అంటే ప్రస్తుతం అతడు నడవలేడు. భారీ కాయంతో వీల్‌చైర్‌కే పరిమితమైన పీటర్‌ మరొకరి సాయం లేకుండా ఏ పని చేయలేడు. పైగా అనారోగ్యంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని జైలుకు పంపించాలంటే మెడికల్‌ హెలికాప్టర్‌లో తీసుకెళ్లి, ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.

ఇందు కోసం కనీసం 40 వేల డాలర్లు (రూ.30 లక్షలు) ఖర్చుఅవుతాయని కోర్టు తెలిపింది. అందుకే అతన్ని జైలుకు పంపకూడదని న్యాయమూర్తి నిర్ణయించారు. అయితే అతన్ని జైలుకు ఎలా పంపాలి..? జైలు శిక్ష విధించగలమా.. లేదా అనే విషయాలపై విచారణ జరిపిన తర్వాతే తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. అప్పటి వరకు అతను ఇంట్లోనే ఉండాలని జడ్జి సూచించారు.

Next Story