చైనా తన తీరు మార్చుకోలేదు. మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించారు. మనదేశ జవాన్లు వారిని అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో లఢక్ ఈశాన్య ప్రాంతం సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంటోంది.

చైనా తన వక్రబుద్ది మార్చుకోలేదు. మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి తెగ ప్రయత్నాలు చేసింది. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) బలగాలు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించింది. దీంతో లడఖ్‌ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పాన్‌గాంగ్‌ సరస్సు వద్ద భారత, చైనా బలగాలు ఘర్షణకు దిగాయి. అయితే ఈ ఘటన ఆగస్టు 29,30వ తేదీల్లో జరిగినట్లు రక్షణశాఖవర్గాలు సోమవారం వెల్లడించాయి. పాన్‌గాంగ్‌ సరస్సు వద్ద ఉన్న తటస్థ స్థితిని మార్చేందుకు చైనా సైనిక దళాలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

చైనా సైన్యం చేపట్టిన ఈ దురాక్రమణ చర్యను భారత సైనిక బలగాలు అడ్డుకున్నాయి. పాన్‌గాంగ్‌ సో సరస్సు వద్ద ఉన్న దక్షిణ ప్రాంతంలో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. మరో వైపు రెండు దేశాల సైనికుల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించేందుకు చుసుల్‌ వద్ద బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగానే చైనా సైనికులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపింది.

కాగా, ఇటీవల జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలను పీఎల్‌ఏ దళాలు ఉల్లంఘంచినట్లు భారత రక్షణ దళాలు పేర్కొంటున్నాయి. చర్చల ద్వారా శాంతి, సామరస్య స్థాపన కోసం తాము కట్టుబడి ఉన్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల సైనిక అధికారుల మధ్య ఇటీవల ఐదుసార్లు చర్చలు జరిగాయి. అయినా లడఖ్‌ సరిహద్దుల్లో ఉన్న వివాదం సద్దుమణగలేదు. జూన్‌ 15వ తేదీన గాల్వన్‌ వద్ద జరిగిన సైనిక దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *