తబ్లిగీ జమాత్ నేత‌ ‌పై హత్య కేసు నమోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2020 10:55 AM IST
తబ్లిగీ జమాత్ నేత‌ ‌పై హత్య కేసు నమోదు

తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కేసు నమోదైంది. ఆయన‌‌పై క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. నిజాముద్దీన్ పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కాంధ్వ‌లీపై సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే.. విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపైనా వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. భౌతిక దూరం నిబంధ‌న‌ను త‌బ్లిగీ నేత ఉల్లంఘించార‌ని, నిజాముద్దీన్ మ‌ర్క‌జ్‌లో మ‌త‌ప‌ర‌మైన స‌ద్సస్సు నిర్వ‌హించ‌డం ద్వారా క‌రోనా బారిన ప‌డి ప‌లువురు మృతి చెంద‌డానికి కార‌కుల‌య్యార‌ని పోలీసులు తెలిపారు.

కాగా.. త‌బ్లిగీ నేత ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయ‌న క్వారంటైన్ కాలం పూర్తిఅయ్యింది. దీంతో నేడో, రేపో అరెస్టు చేసే అవ‌కశాలు ఉన్నాయి. గ‌త నెల 13,14,15 తేదీల్లో ఈ స‌మ్మేళ‌నం జ‌రిగింది. దీని త‌రువాత దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. ఈ స‌ద‌స్సుకు హాజ‌రైన వారిలో చాలా మంది వైర‌స్ బారీన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. వీరితో సన్నిహితంగా ఉన్న చాలా మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ ఘ‌ట‌న కార‌ణంగా దేశంలో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది.

Next Story