సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించిన సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్

సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ ఈ రోజు హైదరాబాద్‌లో తమ సరికొత్త సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 March 2024 10:15 AM GMT
సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించిన సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్

సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ ఈ రోజు హైదరాబాద్‌లో తమ సరికొత్త సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించింది తద్వారా నాణ్యత నియంత్రణ సామర్థ్యాలలో కంపెనీ యొక్క నిరంతర పెట్టుబడిని మరింత బలోపేతం చేసింది. ఈ అత్యాధునిక ల్యాబ్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన విత్తన పరీక్షా సౌకర్యాలలో ఒకటి మరియు భారతదేశం యొక్క మొట్టమొదటి అంకితమైన విత్తన ఆరోగ్య ల్యాబ్‌ను అందిస్తుంది, ఇది భారతదేశంతో పాటుగా ఆసియా పసిఫిక్ మరియు వెలుపల సాగుదారులకు సేవలు అందిస్తుంది.

హైదరాబాద్ సమీపంలోని నూతనకల్ గ్రామంలో ఉన్న ఈ ల్యాబ్, యునైటెడ్ స్టేట్స్ మరియు నెదర్లాండ్స్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో సహా సిన్జెంటా యొక్క కూరగాయల విత్తనాల నాణ్యత నియంత్రణ ల్యాబ్‌ల గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగమైంది, ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత నాణ్యత గల కూరగాయల విత్తన ఉత్పత్తులను అందించాలనే సింజెంటా యొక్క మిషన్‌కు మద్దతు ఇస్తుంది.

"అధిక-నాణ్యత, ఆరోగ్యవంతమైన విత్తనం, మా వినియోగదారులకు ఈ రంగంలో విజయానికి పునాది" అని సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ - ఆసియా పసిఫిక్ హెడ్ నిశ్చింత్ భాటియా అన్నారు. “ఈ పెట్టుబడి పెంపకందారులకు ఆరోగ్యకరమైన, వ్యాధి-రహిత విత్తనాన్ని నమ్మదగిన సరఫరాను అందించాలనే మా నిబద్ధతను వెల్లడి చేస్తుంది. ఈ ప్రపంచ స్థాయి సదుపాయం 'మేక్ ఇన్ ఇండియా' మరియు వ్యవసాయ రంగం లో భారతదేశం యొక్క పెరుగుతున్న నాయకత్వ పాత్రకు మద్దతు ఇస్తూ, ప్రపంచ విత్తన ఎగుమతిదారుగా మారాలనే లక్ష్య సాకారానికి తోడ్పాటు అందిస్తుంది..." అని అన్నారు.

$2.4 మిలియన్ల (రూ. 20 కోట్లు ) తో నిర్మించబడిన 6,500-చదరపు అడుగుల ఆధునిక సదుపాయం ప్రస్తుతం, సంవత్సరానికి 12,000 వైరస్/బ్యాక్టీరియల్ పరీక్షలను ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది భవిష్యత్తు వృద్ధిని అనుసరించి మరింతగా విస్తరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సదుపాయం భారతదేశంలోని విత్తన ఆరోగ్య పరీక్ష నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇంటర్నేషనల్ సీడ్ హెల్త్ ఇనిషియేటివ్ (ISHI) మరియు Naktuinbouw అధీకృత లేబొరేటరీస్ (NAL) వంటి అంతర్జాతీయ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్‌లకు అనుగుణంగా ఉంటుంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL)తో ఎగుమతి ధృవీకరణ మరియు స్థానిక గుర్తింపును కూడా ల్యాబ్ కోరుతోంది.

"గ్లోబల్ సీడ్ స్టీవార్డ్‌షిప్ మరియు విత్తన రంగంలో విత్తన ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, సాగుదారుల పంటల సమగ్రతను కాపాడటం మరియు ప్రపంచ సరఫరా గొలుసులను , ప్రపంచ ఆహార భద్రతను కాపాడటంలో కీలకం" అని సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ మరియు ఫ్లవర్స్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ గ్లోబల్ హెడ్ ఎరిక్ పోస్ట్మా అన్నారు. “సాగుదారునికి అందించే ప్రతి విత్తనం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మొత్తం విత్తన పరిశ్రమ యొక్క భాగస్వామ్య బాధ్యత, అందుకే అంతర్జాతీయ ఫైటోసానిటరీ ప్రమాణాలకు మద్దతు ఇవ్వడానికి ఇతర విత్తన కంపెనీలకు మా విత్తన పరీక్ష సేవలను అందించడం మాకు గర్వకారణం.." అని అన్నారు.

సిన్జెంటా యొక్క హైదరాబాద్ సైట్ మొట్టమొదట 2009లో స్థాపించబడింది. ఇక్కడ 250 కంటే ఎక్కువ మంది ఫుల్ టైం మరియు సీజనల్ ఉద్యోగులు, కార్మికులు వున్నారు. వీరు విత్తన ప్రాసెసింగ్, నాణ్యత నియంత్రణ మరియు సరఫరా కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారు.

దాదాపు 150 సంవత్సరాల క్రితం విభిన్న రకాల కూరగాయలను సాగు చేసిన మొదటి కంపెనీలలో సిన్జెంటా ఒకటి. నేడు 60 కంటే ఎక్కువ దేశాలలో పనిచేస్తున్న కూరగాయల విత్తనాల బృందాలు మరియు 124 దేశాలకు విత్తనాలను రవాణా చేస్తుండటం తో ప్రప్రంచం లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సంస్థగా నిలిచింది.

నూతనకల్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం లో పలువురు ప్రభుత్వ కీలక అధికారులు పాల్గొన్నారు. శ్రీ ఎం రఘునందన్ రావు (IAS), వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి; డాక్టర్ బి గోపి (IAS), డైరెక్టర్ అగ్రికల్చర్, తెలంగాణ ప్రభుత్వం; భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ (క్యూసీ) డాక్టర్ డి కె శ్రీవాస్తవ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

Next Story