'సైరా' 8 రోజుల కలెక్షన్ ఎంత.? ట‌్రేడ్ రిపోర్ట్ ఏంటి..?
By Medi Samrat
మెగాస్టార్ చిరంజీవి నటించిన సంచలన చిత్రం సైరా నరసింహారెడ్డి. అమితాబ్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తూ.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది..? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది..? అనేది అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఆసక్తిగా మారింది.
తాజా సమాచారం ప్రకారం... తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులకు 90 కోట్ల షేర్ సాధించి నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది. దసరా సెలవులు కలిసి రావడం సినిమాకి ప్లస్ అయ్యింది. అయితే... సైరాకి పోటీగా భావించదగిన సినిమాలేవీ దగ్గరలో లేవు. అందువలన ఈ వీకెండ్ తో పాటు మరికొన్ని రోజులు ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే.. తమిళనాడు, కేరళ, కర్నాటకలో సైరా షాక్ ఇచ్చింది. అక్క డ ప్రేక్షకులను ఎందుకనో కానీ.. ఆకట్టుకోలేకపోయింది. ఓవర్ సీస్ లో దాదాపు 18 కోట్లకు బిజినెస్ జరిగితే... ఇప్పటి వరకు దాదాపు 12 కోట్లు కలెక్ట్ చేసింది. సో... ఈ లెక్కల ప్రకారం సైరా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సక్సస్ అయ్యింది.