స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం  దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు వెల్లడించలేమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధామని ఆర్థిక మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది. భారత, స్విట్జార్లాండ్‌ మధ్య ఉన్న ఒప్పందాల మేరకు వివరాలు అందించలేమని తెలిపింది. అలాగే ఇతర విదేశాల నుంచి వచ్చిన నల్లధనం వివరాలు వెల్లడించడానికి ఆ శాఖ నిరాకరించింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సంబంధిత సమాచారం గోప్యంగా ఉంచాల్సి ఉందని తెలిపింది.

పన్ను సంబంధిత సమాచారం, విదేశీ ప్రభుత్వాల నుంచి కోరిన సమాచారాన్ని బహిర్గతం చేయలేమని చెప్పేసింది.కాగా, స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారం పీటీఐకి జర్నలిస్టు మంత్రిత్వ శాఖనుకోరారు. ఈ వివరాలతో సమా నల్లధనంపై విదేశాల నుంచి వచ్చిన సమాచారం వివరాలు అందించాలని కూడా ఆర్టీఐ ద్వారా కోరారు. ఇందుకు స్పందిచిన ఈ శాఖ వివరాలు అందించలేమని తేల్చి చెప్పింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.