రంగంలోకి దిగిన 'యాంకర్‌ రష్మి'

By సుభాష్  Published on  30 Jan 2020 4:21 PM GMT
రంగంలోకి దిగిన యాంకర్‌ రష్మి

ఏపీకి మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించారు సీఎ జగన్‌. దీంతో రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు, దీక్షలు, ర్యాలీలు ఇంకా కొనసాగుతున్నాయి. రాజధాని ప్రకటనను సీఎం జగన్‌ వెనక్కి తీసుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో యాంకర్‌ రష్మి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు తెగ వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో రష్మి పెట్టున పోస్టు రాజధాని గురించి అనుకుంటే పొరపాటే.. కేంద్రం నిర్వహిస్తున్న 'స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020'లో విశాఖను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలపాలని రష్మి రంగంలోకి దిగింది. తన సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా విశాఖపట్నమే నా సొంత ఇళ్లని తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది రష్మి.

''స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020'' మన వైజాగ్‌ కూడా ఉంది. వైజాగ్‌ నివాసిగా ఈ పోటీల్లో విశాఖను నెంబర్‌వన్‌గా నిలపడం మన బాధ్యత. విశాఖకే నా ఓటు.. మీరు కూడా విశాఖ పట్టణానికి మద్దతు ఇవ్వాలి'' అంటూ రష్మి ట్విట్టర్ ద్వారా కోరింది.

కాగా, ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 4370 సుందర నగరాలు పోటీ పడుతున్నాయి. ఈ నగరాలకు సంబంధించిన ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, స్వచ్ఛతా యాప్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఓటు వేయవచ్చు. జనవరి 4 నుంచి ప్రారంభమైన ఈ పోటీ.. జనవరి 31తో ముగియనుంది. దీంతో వైజాగ్‌ను దేశంలోనే సుందర నగరంగా గుర్తించేలా స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020లోనంబర్‌గా నిలిపేందుకు మద్దతు ప్రకటించండి అంటూ రష్మి చెబుతోంది.



Next Story