కొండ చిలువ దాడి నుంచి బయటపడ్డాడు..ఎలా?
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 17 Oct 2019 11:35 AM IST

కేరళ: కొండచిలువ చుట్టేస్తే విడిపించుకోవడం అంత ఈజీ కాదు. అలాంటిది విడిపించుకొని బతికి బయట పడ్డాడు ఓ వ్యక్తి. ఆశ్చర్య పరిచే ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. సాధారణంగా కొండచిలువల్లో విషం ఉండదు. అందుకే అది కరిచినా మనుషులకు విషం ఎక్కదు. కాని పళ్లతో గట్టిగా పట్టుకుని అమాంతంగా మింగేయడం దాని స్పెషాలిటీ. అందుకే ఇవి తమ టార్గెట్ చూసి దాడి చేస్తాయి.. కానీ కొన్నిసార్లు తమకన్నా పెద్దగా ఉన్నవాటిని కూడా మింగే ప్రయత్నం చేస్తాయి. అలానే అడవిలోకి వెళ్లిన ఓ కార్మికుడిని మింగేద్దామనుకున్న ఈ కొండచిలువ నుంచి తోటి కార్మికులు అతనిని రక్షించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కొండచిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Next Story