ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బదిలీ

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 25 Sept 2019 12:40 PM IST

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బదిలీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయనకు ఆదేశాలు అందాయి. కాగా.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.

చేనేత జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్ బదిలీ

అలాగే.. చేనేత, జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్‌ కూడా బదిలీ అయ్యారు. ఆయన సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అతని స్థానంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి జె. మురళికీ చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

Next Story