గుజరాత్‌లో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని రఘుబీర్‌ మార్కెట్‌లోని ఓ 10 అంతస్తులు గల కాంప్లెక్స్‌లో ఉన్న పలు దుకాణాల్లో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 57 ఫైరింజన్లతో సుమారు 200 మంది సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో ఆకాశం మొత్తం నల్లమబ్బులు కమ్ముకున్నాయి. పొగ ఎక్కువ మొత్తంలో వెలువడుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టం మాత్రం రూ.కోట్లలో జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Surat Fire accident Surat Fire accident Surat Fire accident

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.