ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను 6 వారాల పాటు వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ ఈ నెల 15న నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని, ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు..

1. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

2. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం

3. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం

4. హై కోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా ?

5. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాలి

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *