రేపు మరో కీలక తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు..!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 12 Nov 2019 5:49 PM IST

ఢిల్లీ: ఇటీవలే అయోధ్య వివాదంపై చరిత్రాత్మక తీర్పు వెలువరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. మరో కీలక తీర్పు వెల్లడించేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై బుధవారం రోజున కోర్టు తీర్పు చెప్పనుంది. 2010 సంవత్సరంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం ప్రభుత్వ సంస్థనే అని.. అది సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టును తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం రేపు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పును వెల్లడించనుంది.
Next Story