అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మరో మూడు వివాదాస్పద అంశాలపై తీర్పును వెల్లడించనుంది. దీనిలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంకు సంబంధించిన కేసు ఒకటి. కాగా.. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో మార్మోగిన రఫేల్‌ యుద్ధ విమానాల వ్యవహారం మరొకటి. రాఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఇంకోకటి.

శబరిమల..

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం ఈనాటిది కాదు. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు బాలికలు, మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది. కాగా.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై వివాదాస్పదమైంది. ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు ప్రయత్నించినప్పటికీ, ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మహిళలు మాత్రమే లోపలికి వెళ్ళగలిగారు.

అయితే ఈ తీర్పుపై పునః సమీక్ష కోరుతూ అరవై నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్ చేసింది. దానినే సుప్రీం కోర్టు గురువారం వెలువరించనుంది.

ఈ నేపథ్యంలో కేరళలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పదివేల మందికిపైగా పోలీసులను సన్నిధానం, శబరిమల, పంబా నది పరిసర ప్రాంతాల్లో మోహరించారు.

Images

రఫేల్‌..

36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై.. సుప్రీంకోర్టు విచారించింది. అనంతరం 2018 డిసెంబర్‌ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు నిచ్చింది. ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరీలతో పాటు సీనియర్‌ న్యయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగొయి నేతృత్వంలోనే రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది.

123

రాహుల్‌ వ్యాఖ్యలుపై..

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చౌకీదార్‌ చోర్‌ హై అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కూడా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది.

Ra

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story