ఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ సుప్రీంకోర్టు సంచలను తీర్పును వెలువరించింది. గతంలో ఆర్టీఐపై ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్ధిస్తూ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు గల ధర్మాసనం తీర్పును ప్రకటించింది. న్యాయవ్యవస్థలో పాదర్శకత అనేది న్యాయస్వేచ్ఛకు భంగం కారదని మెజారిటీ సభ్యులు సృష్టం చేశారు. గోప్యత హక్కు, సమాచార హక్కు చేయి చేయి కలిపి నడవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

2010 సంవత్సరంలో చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం ప్రభుత్వ సంస్థనే అని.. అది సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఎప్రిల్‌ 4న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. న్యాయవ్యవస్థపై పరిశీలనకు ఒక సాధనంగా ఆర్టీఐ ఉండాలని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.