శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే
By అంజి Published on 24 Nov 2019 12:05 PM ISTతిరుమల: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ బాబ్డే శనివారం తిరుమల చేరుకున్నారు. జస్టిస్ బాబ్డేకు తిరుమలలోని పద్మావతి గెస్ట్‌హౌస్ వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి సహా పలువురు ఘనస్వాగతం పలికారు. మొదటగా సీజేఐ వరాహస్వామిని దర్శించకున్నారు. జస్టిస్ బాబ్డేతో కలిసి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి స్వామివారి సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం మహాద్వారం గుండ ఆలయంలోకి వెళ్లిని జస్టిస్ బాబ్డే శ్రీవారిని దర్శించుకున్నారు. జస్టిస్ బాబ్డేకు ఆలయ పూజారులు వేదమంత్రోచ్చారణాలు పలికారు. తర్వాత జస్టిస్ బాబ్డేకు స్వామివారి లడ్డూప్రసాదాలను అందజేశారు.
ఇవాళ మరోసారి జస్టిస్ బాబ్డే శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జస్టిస్ బాబ్డే ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. కాగా ఇటీవలే సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2021 ఏప్రిల్ 23 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే పదవిలో కొనసాగనున్నారు.