సంక్రాంతి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం
By Newsmeter.NetworkPublished on : 12 Jan 2020 5:50 PM IST

తిరుమల : శ్రీవారి ఆలయంలో సంక్రాంతి నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం ముగియనుండడంతో బుధవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.
గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ బుధవారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో వెల్లడించారు.
Next Story