క‌రోనా విల‌య తాండ‌వం చేస్తున్న నేఫ‌థ్యంలో ప్రజ్వలా ఎన్జీఓ వ్యవస్థాపకురాలు, ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ నేడు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆమెను ఐసోలేషన్ వార్డులో గాంధీ ఆసుప‌త్రి వైద్యులు ప్ర‌త్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సునీతా కృష్ణన్ ఆదివారం సాయంత్రం బ్యాంకాక్ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు.

ప‌ర్య‌ట‌న ముంగించుకుని వ‌చ్చిన ఆమె తేలికపాటి దగ్గు, జ్వ‌రం ఉంద‌న్న కార‌ణంగా స్వచ్ఛందంగా ఆసుపత్రిలో చేరారు. ఇంతలోనే, తెలంగాణలో ఒక కరోనా వైరస్ కేసు నిర్ధారించబడింది. అయితే ఈ కేసు ఏ జిల్లాకు సంబంధించిన‌ వ్యక్తి.. అనేది తెలియాల్సివుంది.

గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌ కుమార్ మాట్లాడుతూ.. మేము ఆమె ర‌క్త‌ నమూనాలను సేక‌రించి.. పరీక్షల నిమిత్తం పంపాము. రిపోర్టులు రేపు వెలువ‌డ‌నున్నాయ‌న్నారు. అయితే.. తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన క‌రోనా పాజిటివ్ విష‌య‌మై పూర్తి వివ‌రాలు తెలియ‌జేయ‌డానికి ఆరోగ్య శాఖ‌ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వ‌హించ‌నున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.