మేకప్ లేకుండా యాంకర్ ‘సుమ’ ఎలా ఉంటుందో చూడండి
By సుభాష్ Published on 24 Jan 2020 2:11 PM GMTయాంకర్ సుమ.. ఈ పేరు తెలుగు ప్రజలందరికి సుపరిచితమే. వయసు నాలుగు పదులు దాటినా.. ఇప్పటికి యాంకరింగ్ లో అదరగొట్టేస్తుంటుంది. యాంకరింగ్ లో సుమను కాదని ఎవరూ కూడా ఢీకొట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె ముందు ఎందరో యాంకర్లు వచ్చినా.. ఆమెను దాటుకుని పోలేకపోతున్నారు. ఇప్పుడు సుమ తన ఇమేజ్ ను స్మాల్ స్ర్కీన్ తో పాటు సోషల్ మీడియాను సైతం పాకేసింది. ఈ మధ్యనే ‘సుమక్క’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ అవుతోంది. అందులో కొన్ని ఫన్ని వీడియోలతో పాటు, వ్యక్తిగత విషయాలు, ఇతర వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఏదేమైనా మాయ మాటలతో మయ చేయడంలో సుమ తర్వాతే అని చెప్పాలి. తన యాంకరింగ్ మొదలు పెట్టిందంటే చాలు మాటలతో ఉర్రూతలూగిస్తుంది. ప్రొగ్రామ్స్ కాకుండా ఈవెంట్లను సైతం వదలడం లేదు. ఇక తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. అందులో మేకప్ లేకుండా ఎలా ఉంటుందో కనిపిస్తుంది.
క్యాష్ ప్రోగ్రాం షూటింగ్ అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఇలానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆ షోలో వివేక్ వర్దిని కళాశాల వాళ్లు ఓ పెయింటింగ్ తో కూడిన ఓ ఫోటోను సుమకు ఇచ్చారు. నిజంగా చాలా అందంగా ఉంది.. ఈ ఫోటోను చూస్తుంటే ఇలాంటి పేయింటింగ్స్ కోసమైనా మేకప్ వేసుకుని పని చేయాలనే ఉత్సాహం కలుగుతోంది అంటూ చెబుతోంది. ఇక చివరగా ‘కమాన్ సత్తి, రమేష్ పదండి.. యుద్ధానికి వెళ్దాం’ అంటూ మేకప్ వేసుకునేందుకు సిద్ధమవుతోంది.