అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌

By సుభాష్  Published on  27 April 2020 3:11 AM GMT
అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. సుకుమా జిల్లాలోని దమన్‌కొంట అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. కాగా, తోంగుపాల్‌ అటవీ ప్రాంతం పరిధిలో సీఆర్పీఎఫ్‌ 227 బెటాలియన్‌కు చెందిన జవాన్లు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, తారసపడిన కొంత మంది మావోలు జవాన్లపై కాల్పులకు దిగారు. అప్రమత్తమైన జవాన్లు వారి కాల్పులను తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

పేలుడు పదార్థాలు స్వాధీనం

Sukma Encounter1

కాగా, ఆదివారం సంఘటన స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు సంబంధించి ఇతర వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ప్రాంతం మావోయిస్టులకు అడ్డాగా మారింది. మావోలను అంతమొందించడం కోసం జవాన్లు ఎప్పటికప్పుడు కూంబింగ్‌ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు సైతం మావోలు అడ్డుతగులుతున్నారు.

Next Story
Share it