ఆత్మాహుతి దాడి.. ముగ్గురు పౌరులు మృతి

By సుభాష్  Published on  30 April 2020 9:34 AM GMT
ఆత్మాహుతి దాడి.. ముగ్గురు పౌరులు మృతి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. బుధవారం నాటి ఆత్మాహుతి దాడి మరువకముందే గురువారం మరో ఆత్మాహుతి దాడి జరిగింది. కాబూల్‌ శివార్లలో ఆర్మీ ప్రత్యేక బలగాల స్థావరంపై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, 15 మంది వరకూ గాయపడ్డారు. అయితే దాడికి పాల్పడింది తాలిబన్లేనని ఆప్గాన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, బుధవారం జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఆఫ్గాన్‌ దక్షిణ మంత్రి, యూఎస్‌ దళాల కమాండర్‌ జనరల్‌ అసదుల్లా ఖలీద్‌లు ఆర్మీ స్థావరాన్ని సందర్శించి వెళ్లిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. ఆర్మీ కమాండోల బేస్‌ బయట కొందరు కాంట్రాక్టర్లు వేచి ఉండగా, ఆత్మాహుతి దళాల సభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డాడు.

Next Story