చిత్తూరు జిల్లా రామసముద్రంలో దారుణం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి స్వగ్రామం రామసముద్రంకు నడిచి వచ్చిన హరిప్రసాద్‌ అనే వ్యక్తి ఉరిబయటే సృహ కోల్పోయి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పొలాల్లోనే వదిలేసి వెళ్లిపోయారు. అయితే మృతుడు రామసముద్రం మండలం మిట్టపల్లెకు చెందిన హరిప్రసాద్‌గా గుర్తించారు పోలీసులు.

ఎస్సై రవికుమార్‌ సిబ్బందితో మృతదేహం వద్ద పహరా ఉంచారు. కరోనా వ్యాధితో మృతి చెందాడనే అనుమానంతో బంధువులు మృతదేహం వద్ద కూడా రాలేదు. మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కరోనా లేదని తేలింది. ఇక పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.