ఏపీ: కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల

By సుభాష్  Published on  30 April 2020 6:36 AM GMT
ఏపీ: కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గురువారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మొత్తం 1403 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 321 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య 30 కి చేరగా, గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1051 మందికి కరోనాతో చికిత్స పొందుతున్నారు.

ఇక గడిచిన 24 గంటల్లో 34 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అందులో గుంటూరు నుంచి 28 మంది, అనంతపూర్‌ 3, తూర్పుగోదావరి 2, విశాక ఒకరు చొప్పున డిశ్చార్జ్‌ అయ్యారు.

Ap Corona

Next Story
Share it