వైజాగ్ లో లీకైన స్టైరీన్ గ్యాస్ : మనిషిపై చూపే ప్రభావం ఏమిటి..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 May 2020 4:41 AM GMT
వైజాగ్ లో లీకైన స్టైరీన్ గ్యాస్ : మనిషిపై చూపే ప్రభావం ఏమిటి..?

విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారరుజామున పరిశ్రమ నుంచి భారీ మొత్తంలో రసాయన వాయువు లీక్‌ కావడంతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రసాయన వాయువు లీక్‌ కావడంతో రోడ్లపై ఉన్న ప్రజలు ఎక్కడికక్కడే తవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐదు కిలోమీటర్ల మేరకు వ్యాపించడంతో.. పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వైజాగ్ లో లీకైన గ్యాస్ ను స్టైరీన్ గ్యాస్(styrene) గా చెబుతున్నారు. స్టైరీన్ గ్యాస్ కారణంగా ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది. దీన్ని డైరెక్ట్ గా పీల్చడం వలన ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పైపులు, ఆటోమొబైల్ పార్ట్స్, ప్రింటింగ్ క్యాట్రిడ్జ్, ఫుడ్ కంటైనర్, ప్యాకేజింగ్.. వంటి వాటికి ఉపయోగిస్తారు.

స్టైరీన్ అన్నది సాధారణంగా సిగరెట్లలోనో, ప్యాకింగ్ ప్రోడక్ట్స్ లోనూ ఉంటది. వాహనాల పొగలో కూడా కొద్ది మొత్తంలో స్టైరీన్ ఉంటుంది. కొన్ని కొన్ని పండ్లలో కూడా స్టైరీన్ అన్నది ఉంటుంది.

స్టైరీన్ ఉన్న భోజనాన్ని, నీటిని తీసుకోవడం ద్వారా అది లోపలి వెళ్లే అవకాశం ఉంది. పాలీస్టెరీన్ కంటైనర్లను ఫుడ్ స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీని వలన కలిగే ప్రమాదం చాలా తక్కువే.

సిగరెట్లను తాగడం, సెకండ్ హ్యాండ్ స్మోక్, వాహనాల వలన వచ్చే వాయువుల్లో కూడా స్టైరీన్ ఉంటుంది. బిల్డింగ్ మెటీరియల్స్ లో కూడా నుండి కూడా స్టైరీన్ అన్నది చిన్న మొత్తంలో ఉంటుంది. స్టైరీన్ తో తయారైన పదార్థాలు వాడడం వలన కూడా చర్మంపై ప్రభావం చూపుతుంది. ఇవంతా చాలా చిన్న మొత్తంలో స్టైరీన్ ను మనిషి తాకితే చోటు చేసుకునే పరిణామాలు.

స్టైరీన్ గ్యాస్ ను పీల్చడం వలన కలిగే ఇబ్బందులు:

తాత్కాలిక ఇబ్బందులు:

కళ్ళకు, చర్మం, ముక్కుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

విపరీతమైన మంట.

జీర్ణాశయాంతర సమస్యలు.

గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం.

స్పృహ తప్పి పడిపోవడం.

దీర్ఘకాలిక సమస్యలు:

నాడీ వ్యవస్థ మీద కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది.

తల నొప్పి వచ్చే అవకాశము ఉంటుంది.

డిప్రెషన్ కు దారితీస్తుంది.

అలసట.. బలహీన పడడం.

వినికిడి కోల్పోవడం.

బ్యాలెన్స్.. ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఎక్కువ సేపు ఈ గ్యాస్ ను పీల్చడం వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి.. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. వైజాగ్ లో గ్యాస్ లీక్ ఘటన ఇలాంటిదే..!

Next Story