అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2020 11:15 AM GMT
అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి

ఎల్బీన‌గ‌ర్‌లో విషాదం చోటు చేసుకుంది. వైద్య విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని సాహితిగా గుర్తించారు. వివ‌రాల్లోకి వెళితే.. సాగ‌ర్ రింగ్‌రోడ్డులో ఉన్న అలేఖ్య ట‌వ‌ర్స్‌లో 14 వ అంత‌స్థులో ర‌ఘ‌రాం, ప‌ద్మ దంప‌తులు నివ‌సిస్తున్నారు. వారి కూతురు సాహితి ఉస్మానియా ప్ర‌భుత్వ డెంట‌ల్ కాలేజీలో(బీడీఎస్‌) నాలుగో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంది. కాగా.. ఈ రోజు మ‌ధ్యాహ్నం (మంగ‌ళ‌వారం)త‌న ఇంట్లోని బాల్క‌నీలో ఉన్న గ్రిల్స్ తొల‌గించి పై నుంచి దూకింది. 14వ అంత‌స్తు నుంచి దూక‌డంతో ఆమె అక్క‌డిక్క‌డే మృతి చెందింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో చాలాకాలంగా మనోవేదనకు గురైన సాహితి ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి రఘురామ్ తెలిపారు. ఇదిలా ఉంటే అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it