చ‌రిత్ర సృష్టించిన 'స్టువర్ట్‌ బ్రాడ్'.. ఈ ద‌శాబ్దంలోనే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Dec 2019 4:30 PM GMT
చ‌రిత్ర సృష్టించిన స్టువర్ట్‌ బ్రాడ్.. ఈ ద‌శాబ్దంలోనే..

ఇంగ్లండ్ సీనియ‌ర్ బౌల‌ర్ స్టువర్ట్‌ బ్రాడ్ చ‌రిత్ర‌ సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భాగంగా స్టువ‌ర్ట్ బ్రాడ్ ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ వికెట్‌ తీసిన బ్రాడ్ ఈ అరుదైన రికార్డు సాధించాడు. వివ‌రాళ్లోకెళితే.. బ్రాడ్.. ఈ రోజు మొద‌లైన టెస్టులో డుప్లెసిస్ వికెట్ తీయ‌డం ద్వారా 20వ‌ దశాబ్దంలో నాలుగు వందల వికెట్లను సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. త‌న దేశానికే చెందిన‌ సహచర బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తర్వాతి స్థానంలో బ్రాడ్ నిలిచాడు.

అయితే.. ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ 20వ ద‌శాబ్దంలో 428 వికెట్లు తీసి అగ్ర‌స్థానంలో నిలవగా, 400 వికెట్ల‌తో ఆ తర్వాతి స్థానంలో బ్రాడ్‌ నిలిచాడు. అలాగే అండర్సన్‌ ఇప్పటివరకూ టెస్టుల్లో 576 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, బ్రాడ్ మాత్రం 473 వికెట్లు తీశాడు. అలాగే.. వీరిద్ద‌రి త‌ర్వాత‌ ఈ దశాబ్దంలో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్ లియాన్‌(376), శ్రీలంక స్పిన్నర్‌ రంగనా హెరాత్‌(363), స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(362) త‌ర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Next Story
Share it