సచివాలయం కూల్చివేత పనులు ఆపండి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

By సుభాష్  Published on  10 July 2020 8:37 AM GMT
సచివాలయం కూల్చివేత పనులు ఆపండి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తెలంగాణ సచివాలయ కూల్చివేతకు బ్రేక్‌ పడింది. సోమవారం వరకు సచివాలయ కూల్చివేత ప్రక్రియ పనులు నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కూల్చివేత పనులను నిలిపివేయాలని కోరుతూ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు.. కూల్చివేత పనులను నిలిపివేయాలని సూచించింది. అలాగే పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

పాత సచివాలయ భవనాలు శిథిలావస్థలో ఉన్నందున వాటిని కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. అయితే కూల్చితపై దాఖలైన పిటిషన్లపై ఇటీవల హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కూల్చివేత పనులను జూలై 7 నుంచి ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. సచివాలయం వైపు ఎలాంటి వాహనాలు రానివ్వకుండా రహదారిని సైతం మూసిశారు. పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సచివాలయ భవనం కూల్చివేతపై విపక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాధనం వృథా చేయడం సరికాదని మండిపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కూల్చివేత పనులు వాయిదాపడనున్నాయి.

Next Story