11 ఏళ్ల రికార్డును దాటిన సెన్సెక్స్..

By రాణి  Published on  30 April 2020 4:44 PM IST
11 ఏళ్ల రికార్డును దాటిన సెన్సెక్స్..

ఏప్రిల్ నెలాఖరులో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కరోనా తో ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా అప్పుడప్పుడూ లాభాలు..ఎక్కువగా నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు కాస్త వేగం పుంజుకున్నాయి. గడిచిన 11 ఏళ్ల చరిత్రను సెన్సెక్స్ ఈనెలాఖరులో తిరగరాసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 14 శాతం లాభాలను గడిచింది సెన్సెక్స్. కరోనాకు వ్యాక్సిన్ ను కనుగొంటున్నారన్న వార్తలు, పేదల కోసం కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు మార్కెట్లలో లాభాలను తెచ్చిపెట్టాయి. గురువారం స్టాక్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 33,718కి చేరింది. అలాగే నిఫ్టీ 30 పాయింట్లు లాభాలను గడించి 9,860 వద్ద ముగిసింది.

Also Read : బుట్ట‌బొమ్మ సాంగ్‌కు డేవిడ్ వార్న‌ర్ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

సెన్సెక్స్, నిఫ్టీ లు కాస్త లాభాలు గడించడంతో మధుపరులకు కాస్త ఊరట లభించింది. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ వల్ల షేర్ కొనుగోళ్లు, అమ్మకాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరులో కాస్తంత లాభాలు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇన్వెస్టర్లు.

Also Read :రిషి కపూర్ పై ప్రధాని ప్రశంసలు..కుప్పకూలిన అమితాబ్

Next Story