బుట్ట‌బొమ్మ సాంగ్‌కు డేవిడ్ వార్న‌ర్ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2020 10:29 AM GMT
బుట్ట‌బొమ్మ సాంగ్‌కు డేవిడ్ వార్న‌ర్ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

క‌రోనా ముప్పుతో క్రీడ‌ల‌న్ని నిలిచిపోయాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. క‌రోనా సెల‌వుల్ని క్రికెట‌ర్లు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప‌లువురు క్రికెట‌ర్లు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఆస్ట్రేలియా విధ్వంస‌క ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అయితే.. రోజుకో వీడియోతో అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. మొన్న బాలీవుడ్ సాంగ్ 'షీలాకి జ‌వాని' సాంగ్ కు స్టెప్పులు వేసిన ఈ స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు తాజాగా అల్లు అర్జున్ హీరోగా న‌టించిన 'అల వైకుంఠ పురంలో' చిత్రంలోని "బుట్ట బొమ్మ" సాంగ్‌కు భార్య క్యాండిస్‌తో క‌లిసి చిందులేశాడు‌. వార్నర్‌ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వారి కుమార్తె ఇండి కూడా వెనకాల తిరుగుతూ తనకు తోచిన స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను వార్నర్‌ దంపతులు వారి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లలో పోస్ట్‌ చేశారు. వార్న‌ర్ స‌న్ రైజ‌ర్స్ టీ ష‌ర్ట్ ధ‌రించి మ‌రీ డ్యాన్స్ చేయ‌డం ఇక్క‌డ విశేషం.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బుట్టబొమ్మ బ్రేక్స్ ది బోర్డర్ అంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో వార్న‌ర్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌రుపున ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇంకెందుకు ఆల‌స్యం వార్న‌ర్ ఎలా స్టెప్పులు వేశాడో మీరూ ఓ లుక్కేయండి.

Next Story
Share it