ఆవిరి పట్టుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు.. పరిశోధనలో తేల్చిన వైద్యులు

By సుభాష్  Published on  3 Aug 2020 2:33 PM IST
ఆవిరి పట్టుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు.. పరిశోధనలో తేల్చిన వైద్యులు

ప్రస్తుతం కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు వంటింటి చిట్కాలకే ఎక్కవ మొగ్గు చూపుతున్నారు. వంటింటి చిట్కాలే కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుండటంతో ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్లు లేకపోవడంతో చివరకు పెద్దలు చెప్పిన చిట్కాలను సైతం పాటించాలని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు. ఇదే అవిరి చికిత్స. ఇప్పుడు ఇదే ప్రధాన ఔషధంగా ఉపయోగపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తాజాగా ముంబాయిలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి వైద్యులు మూడు నెలలుగా పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ఆస్పత్రికి చెందిన డాక్టరర్‌ దిలీప్‌పవార్‌ నేతృత్వంలో ఈ పరిశోధనలు కొనసాగాయి. అవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్లు వారి పరిశోధనలో తేలింది.

పలువురు కరోనా పేషెంట్లపై స్టీమ్‌ థెరఫీ (అవిరి పట్టడం) ప్రయోగించడం వల్ల ఎంతో మేలైనట్లు గుర్తించారు. అసింప్టమాటిక్‌ (ఎలాంటి లక్షనాలులేని) పాజిటివ్ బాధితులు రోజుకు మూడు సార్లు అవిరి పట్టడం వల్ల త్వరగా కొలుకున్నారని గుర్తించారు. సాధారణంగా ఇది ఇంటి చిట్కా అయినా కోవిడ్‌ సమయంలో బగా ఉపయోగపడుతోంది. పరిశోధనలో 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. ముందుగా గ్రూపులోని లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడుసార్లు ఆవిరి చికిత్స చేయగా,మూడు రోజుల్లోనే కోలుకున్నారు.

అలాగే లక్షణాలు ఉండి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారంలో సాధారణ స్థితికి వచ్చినట్లు వారి పరిశోధనలో స్పష్టమైంది. కొన్ని రకాల క్యాపూల్స్‌, విక్స్‌, అల్లం, ఇలా కొన్ని రకాలతో ఆవిరి చికిత్స చేశారు. ఇలా ఇంటి చిట్కా అయిన ఆవిరి పట్టడం వల్ల కరోనా నుంచి జయించవచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.

Next Story