శ్రీశైలం: మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం
By సుభాష్ Published on 21 Aug 2020 8:41 PM ISTనిన్న రాత్రి శ్రీశైలం ఎడమగట్టు (తెలంగాణ జెన్‌కో) విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అయితే మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్‌గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల నగదు, మిగతా వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చొప్పున నష్టపరి హారం ప్రకటిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రకటించారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇతర శాఖపరమైన ప్రయోజనాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. అయితే బ్యాటరీలు మార్చే సమయంలో మంటలు వ్యాపించి ప్రమాదం జరిగినట్లు అనుమానం ఉందని మంత్రి అన్నారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ధృవీకరించింది.
డీఈ శ్రీనివాస్ (హైదరాబాద్)
ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ)
ఏఈ మోహన్‌రావు (హైదరాబాద్)
ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్)
ఏఈ సుందర్ (సూర్యాపేట)
ప్లాంట్ అటెండర్ రాంబాబు (ఖమ్మం)
జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ (పాల్వంచ)
హైదరాబాద్‌కు చెందిన అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్‌లు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.