జయహో కృష్ణమ్మ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 10:55 AM GMT
జయహో కృష్ణమ్మ

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో శ్రీశైలం క్రెస్ట్ గేట్లు ఇవ్వాళ తెరుచుకోనున్నాయి. సాయంత్రం 6 గంటలకు స్థానిక ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డిలు ఇద్దరు గేట్లను ఎత్తే కరెంటు స్విచ్చ్‌ను నొక్కుతారు. కేబినెట్ మీటింగ్ లో పాల్గొనాల్సిరావడం వల్ల ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ యాదవ్ రాలేక పోతున్నట్టు డ్యాం అధికారులకు సమాచారం అందింది.

సాయంత్రానికి శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని CWC అప్రమత్తం చేసింది. రోజుకు దాదాపు 32 టిఎంసీల చొప్పున వరద వస్తోంది. ప్రవాహం మరో రెండ్రోజులు ఇదే విధంగా కొనసాగితే శుక్రవారం నాడు నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకుంటాయి. కిందటేడాది లాగానే ఈ సారీ ఆగస్టులోనే కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్లు నిండటం వ్యవసాయానికి ఊపిరిపోసింది. ప్రస్థుత పరిస్థితులను బట్టి చూస్తే నాగార్జున సాగర్ ఆయకట్టుకు రెండో పంటకూ నీరు అందుతుంది.

  • BT. గోవింద రెడ్డి

Next Story
Share it