పాలిటిక్స్ సరే.. ముందు తమిళ సినిమారంగం సంగతి తెలుసుకో...!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 12:49 PM IST
పాలిటిక్స్ సరే.. ముందు తమిళ సినిమారంగం సంగతి తెలుసుకో...!!

ముఖ్యాంశాలు

  • రాజకీయాలపై లుక్కేసిన శ్రీరెడ్డి
  • తమిళనాడు కాస్త జాగ్రత్తగా ఉంటున్న శ్రీరెడ్డి
  • దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకునే పనిలో శ్రీరెడ్డి

మన సినీ అగ్గిబరాటా శ్రీరెడ్డి త్వరలో రాజకీయాల్లోకి వస్తుందట. ఈ సంగతిని ఆమే ప్రకటించుకుంది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తున్న అమ్మడు కాస్త జాగ్రత్తపడుతోంది. నోరును కూడా అదుపులో పెట్టకుంటంది. తెలుగు సినీ రంగంలో వాట్సప్ సందేశాలను, వీడియోలను షేర్ చేసి సంచలనం చేసిన శ్రీ రెడ్డి విషయంలో తమిళులు ముందు నుంచే కాస్త జాగ్రత్తగా ఉన్నారు. ఆమె కూడా వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడింది.

అంతలో హఠాత్తుగా ఆమె డీఎంకే అధినేత కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తనను లైంగికంగా వేధించినట్టు పోస్టులు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి. దాంతో తమిళ తంచనిబిలు, ముఖ్యంగా డీఎంకే అనుయాయులు ఆమెను నిలదీశారు. మన సినిమాల్లా కాకుండా తమిళనాట సినిమా వాళ్లు కాస్త డిఫరెంట్. అక్కడ సినిమాలు, రాజకీయాలు కలిసి కాపురం చేస్తాయి. పార్టీల జెండాలు, సినిమా ఏజెండాలు కలిసి ప్రయాణం చేస్తాయి. దాంతో శ్రీ రెడ్డికి చాలా వేగంగా జ్ఞానోదయం అయింది. “అబ్బే ... అది నేను పెట్టిన పోస్టు కాదు... ఎవరో నా అకౌంటును హ్యాక్ చేశారని సంజాయిషీ ఇచ్చింది. తసలు ఉదయనిధి స్టాలిన్ ను తానెన్నడూ కలవనే లేదని కూడా వివరణ ఇచ్చింది.

ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తాను త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఆమె ప్రకటించింది. అయితే అక్కడా ఆమె పప్పులో కాలేసింది. పురుచ్చి తలైవి జయలలిత తనకు ఆదర్శం అని ఆమె చెప్పింది. ఆమె జీవితం తనను ఎంతో ప్రేరేపించిందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. రాజకీయాల్లోకి వస్తే బాగానే ఉంటుంది. కాసింత గ్లామర్ టచ్ రాజకీయాలకు ఎంతో కొంత అవసరం. కానీ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విషయంలో పోస్టుల విషయంలో ఇంకా రాజుకుంటూ ఉండగానే ఆమె స్టాలిన్లకు నచ్చని ఒకే ఒక్క మాటను పలికేసింది. జయలలిత తనకు ఆదర్శం అన్న తరువాత ఆమె డిఎంకె “బంగారు పుట్టలో వేలు పెట్టినట్టే”. అలా చేస్తే కుట్టకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు స్టాలిన్ కుటుంబం కోపం ఇంకా పెరుగుతుంది.

అమ్మా శ్రీ రెడ్డీ... ఇది తెలుగు సినీ రంగం కాదు ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఊరుకోవడానికి. తమిళ రంగంలో రొంబా కష్టమా ఇరుక్కుం. కాస్త జాగ్రత్త తల్లీ!

Next Story