నన్ను బెదిరిస్తున్నారు.. పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెడ‌తామ‌ని..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Feb 2020 12:10 PM IST
నన్ను బెదిరిస్తున్నారు.. పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెడ‌తామ‌ని..

టాలీవుడ్ న‌టి శ్రీరెడ్డి మరోమారు వార్తల్లోకెక్కారు. గ‌తంలో లైంగిక ఆరోపణలతో టాలీవుడ్‌ను షేక్ చేసిన శ్రీరెడ్డి.. తాజాగా తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్నారనే ఆరోప‌ణ‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. ఈ విష‌య‌మై శ్రీరెడ్డి బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకెళితే... కొద్దిరోజుల క్రితం త‌మ‌పై సోష‌ల్‌మీడియాలో అసభ్యకరమైన‌ పోస్ట్‌లు పెట్టారంటూ.. శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి, డ్యాన్స్‌మాస్ట‌ర్‌ రాకేశ్ లు తెలంగాణా క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి.. నటి కరాటే కల్యాణి, డాన్స్‌మాస్ట‌ర్‌ రాకేశ్‌ పై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి ఫిర్యాదులో.. వారిద్దరూ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. కరాటే కల్యాణి, రాకేశ్‌ మాస్టర్ తన గురించి సోష‌ల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని.. తాను చెన్నైలో కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీని గురించి వారివురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అంతేకాక తనను పెట్రోల్‌ పోసి తగల పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. అందుకే ఫిర్యాదు చేసాన‌ని తెలిపారు.

Next Story